Article 370: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమౌతోంది. ఆర్టికల్ 370 రద్దు విషయమే ఇప్పుడు ప్రశ్నార్ధకమయ్యేలా వాదన కొనసాగుతోంది. ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్సెస్ కపిల్ సిబల్ మధ్య జరిగిన ఆసక్తికరమైన వాదనను ఓసారి పరిశీలిద్దాం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా కల్పిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా ఆర్టికల్ 370ను ఇటీవలే రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదన జరుగుతోంది.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జిస్టిస్ ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గావియల్, సూర్య కాంత్‌లు చేపట్టారు. ఈ సందర్భంగా పిటీషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనానికి మధ్య ఆసక్తికరమైన వాదన కొనసాగింది. జమ్ము కశ్మీర్ ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే వ్యవస్థ ఉందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ ఆ అధికారమే లేకుంటే రాజ్యాంగ మౌళిక స్వరూపం తరహాలో ఆర్టికల్ 370కు ప్రత్యేక కేటగరీ సృష్టిస్తున్నామా అని సందేహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా మార్పు చేసే అధికారం 1957లో రద్దైన జమ్ము కశ్మీర్ రాజ్యాంగసభకు మాత్రమే ఉందని కపిల్ సిబల్ తెలిపారు. ఇప్పుడా సభ లేనందున ప్రత్యేక హోదా తొలగించే హక్కు కూడా లేదని వాదించారు. కపిల్ సిబల్ వాదనపై జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టే ఆర్టికల్ 368 కిందకు కూడా ఇది రాదా అని ప్రశ్నిస్తే..కపిల్ సిబల్ రాదనే సమాధానమిచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 370 రద్దుకు అసలైన, సరైన ప్రక్రియ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 ని సరైన పద్ధతిలో రద్దు చేసేందుకు సమాధానాలు వెతకడం కాదని..రద్దుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతి సరైందా కాదా అనేది తేల్చాలని కపిల్ సిబల్ బదులిచ్చారు. ఆర్టికల్ 370 మార్పులనేవి కేవలం రాజ్యాంగసభతోనే సాధ్యమని..పార్లమెంట్‌తో కాదనేది కపిల్ సిబల్ అంతిమంగా సమాధానమిచ్చారు. ఇప్పుడీ అంశంపై పిటీషనర్ల తరపు న్యాయవాదులు, కేంద్ర ప్రభుత్వం కూడా వాదన విన్పించాల్సి ఉంది. ఈ కేసులో తదుపరి వాదనలు ఆగస్టు 8న జరగనున్నాయి.
Also read: Gyanvapi Row: జ్ఞానవాపి మసీదు ఆవరణలో టెన్షన్, ప్రారంభమైన పురావస్తు శాఖ సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook