Jammu Kashmir Killings: జమ్మూకశ్మీర్‌లో వరుస హత్యలు... బ్యాంక్ మేనేజర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు...

Jammu Kashmir Killings: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. వరుస హత్యలతో కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 02:28 PM IST
  • జమ్మూకశ్మీర్‌లో మరో హత్య
  • విజయ్ కుమార్ అనే బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • రెండు రోజుల క్రితమే రజనీ అనే టీచర్ హత్య
Jammu Kashmir Killings: జమ్మూకశ్మీర్‌లో వరుస హత్యలు... బ్యాంక్ మేనేజర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు...

Jammu Kashmir Killings: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రెగిపోతున్నారు. ఇటీవలి కాలంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన రజనీ అనే కశ్మీర్ పండిట్ హత్యను మరవకముందే జమ్మూకశ్మీర్‌లో మరో హత్య జరిగింది. కుల్గాం జిల్లాలో ఓ బ్యాంకు మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతుడిని విజయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. రాజస్తాన్‌కి చెందిన అతను కుల్గాం జిల్లాలోని మోహన్‌పొరాలో ఎల్లక్వై దేహతి బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయ్ కుమార్ హత్యపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందినవారికి సంతాపం ప్రకటించడం... హత్యను ఖండిస్తూ ట్వీట్ చేయడం రెగ్యులర్ యాక్టివిటీగా మారిపోయిందన్నారు. విజయ్ కుమార్ హత్యకు గురవడం బాధాకరమని... ఇది లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడేనని పేర్కొన్నారు. 

రెండు రోజుల క్రితం ఇదే కుల్గాం జిల్లాలో రజనీ అనే కశ్మీర్ పండిట్ టీచర్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. స్కూల్ వద్దే ఆమెపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అంతకుముందు, బుద్గాం జిల్లాలో ఓ టీవీ నటిని కాల్చి చంపారు. గత నెలలో బుద్గాం జిల్లాలో రాహుల్ భట్ అనే ఓ కశ్మీరీ పండిట్ హత్య స్థానికంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలతో తమకు రక్షణ కరువైందని అక్కడి పండిట్లు వాపోతున్నారు. గడిచిన 5 నెలల్లో కశ్మీర్‌లో 15 మంది భద్రతా సిబ్బంది, 18 మంది సాధారణ పౌరులు ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయారని... ఇదేమీ సినిమా కాదు... ఇవాళ్టి కశ్మీర్.. ఇకనైనా ప్రధాని మేల్కొవాలంటూ బుధవారం (జూన్ 1) రాహుల్ గాంధీ ట్వీట్ ద్వారా చురకలంటించారు.

Also Read: TV Actor Killed: జమ్మూకశ్మీర్‌లో దారుణం... టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు...

Also Read: Kashmiri Pandit Killing: కశ్మీర్ పండిట్లలో పెల్లుబికిన ఆగ్రహం... పెద్ద ఎత్తున ఆందోళనలు... పోలీసుల లాఠీఛార్జి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News