Shopian Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ కలకలం రేపింది. షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పలు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదాలను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు కాశ్మీర్ ఏడీజీపీ వెల్లడించారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని షోపియాన్‌కు చెందిన లతీఫ్ లోన్, అనంతనాగ్‌కు చెందిన ఉమర్ నజీర్‌గా గుర్తించారు.
షోపియాన్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారంతో.. భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ముందుగానే ఉగ్రవాదులు లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉగ్రవాదులు ఏమాత్రం లెక్కచేయకుండా భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చాయి భద్రతాదళాలు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్, 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.
గత నెలలో భారీ ఆపరేషన్
గత నెల నవంబర్ 11న షోపియాన్‌లోని కప్రాన్ గ్రామంలో ఒక మదర్సాలో ఉన్న విద్యార్థులను బందీలుగా పట్టుకున్న పాకిస్థానీ ఉగ్రవాదీని భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని జైషే మహ్మద్ సంస్థతో సంబంధం ఉన్న కమ్రాన్ భాయ్ అలియాస్ అనీస్‌గా గుర్తించారు. కప్రాన్ గ్రామంలోని మదర్సా దారుల్ ఉలూమ్ ఖలీద్ ఇబ్న్ వలీద్‌లో ఇద్దరు 11 ఏళ్ల విద్యార్థులను జైష్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ఆ సమయంలో మదర్సాలో మొత్తం 31 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆపరేషన్ సమయంలో మదర్సా, సమీపంలోని మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు, సీఆర్పీఎఫ్ 178 బెటాలియన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. ప్రతీకారంగా భద్రతా బలగాలు అతడిని హతమార్చాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే-74, 4 మ్యాగజైన్‌లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 20న అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సమయంలో లష్కరే తోయిబా సంస్థతో సంబంధం ఉన్న సజ్జాద్ తంత్రే అనే ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్టుల రహస్య స్థావరాలను గుర్తించడానికి తంత్రేని బిజ్‌బెహరాలోని చెక్ డూడు ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. తంత్రేకి బుల్లెట్ కూడా తగలడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. హైబ్రిడ్ ఉగ్రవాది సజ్జాద్ తంత్రే లోయలో వలస కూలీల హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా మరోసారి షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి.
Also Read: CM Jagan: సీఎం జగన్ అంటే ఇష్టం.. కుప్పంలో మాత్రం పోటీ చేయను: స్టార్ హీరో
Also Read: Tamannaah Bhatia: జీన్స్‌లో తమన్నా రచ్చ.. పిచ్చెక్కించే లుక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook