Jaipur: దేశవ్యాప్తంగా 'ఒమిక్రాన్' భయాలు..ఒకే కుటుంబంలోని 9 మందికి కొవిడ్ పాజిటివ్!

Covid-19 positive:  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ...రాజస్థాన్ లోని ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 07:38 PM IST
Jaipur: దేశవ్యాప్తంగా 'ఒమిక్రాన్' భయాలు..ఒకే కుటుంబంలోని 9 మందికి కొవిడ్ పాజిటివ్!

Jaipur: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌  గుబులు రేపుతున్న నేపథ్యంలో...రాజస్థాన్‌(Rajasthan)లోని  ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్‌ పాజిటివ్‌(Covid-19 positive)గా తేలింది. ఇటీవల నలుగురు వ్యక్తులు దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌(Jaipur)కు రాగా.. ఒమిక్రాన్‌(Omicron) కలకలం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్‌ సోకినట్టు నిర్ధారించారు.

Also Read:Hyderabad Covid: విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి పాజిటివ్

 దక్షిణాఫ్రికా(South Africa) నుంచి వచ్చిన వారిని రాజస్థాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (RUHS)లో చేర్పించారు. ఆ కుటుంబంలో 14 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించగా.. తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చీఫ్‌‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నరోత్తమ్‌ శర్మ వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురినీ ఐసోలేషన్‌లో ఉంచినట్టు  తెలిపారు. మిగతా ఐదుగురిని హోం క్వారంటైన్‌లో పెట్టారు. వీరందరి శాంపిల్స్‌ని జైపూర్‌లోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 213 కరోనా యాక్టివ్‌ కేసులు(Covid Active cases) ఉండగా.. వీటిలో ఒక్క జైపూర్‌లోనే 114 కేసులు నమోదయ్యాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News