ISRO: ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న రాకెట్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
భారత అంతరిక్ష పరిశధన సంస్థ మరో ప్రయోగానికి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ISRO) వేదికైంది. జీఎస్ఎల్వి - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం రేపు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు జరగనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇవాళ తెల్లవారుజాము 3 గంటల 43 నిమిషాలకు ప్రారంభమైంది. నిన్న ఉదయం ఇస్రో ఛైర్మన్ శివన్(K Sivan)నేతృత్వంలో షార్‌లో మిషన్ సంసిద్ధత సమావేశం ముగిసింది. ప్రయోగ పనుల్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ ఛైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యాన శాస్త్రవేత్తలు మద్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్ , ప్రయోగంపై చర్చించారు. రాకెట్‌లోని రెండోదశలో భాగంగా ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 03తో జీఎస్ఎల్వి(GSLV F10)రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Also read: నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook