West Bengal: సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరేనా

West Bengal: బీజేపీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Last Updated : Dec 28, 2020, 06:41 PM IST
West Bengal: సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరేనా

West Bengal: బీజేపీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

2021 లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ( West Bengal Assembly Elections ) జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ పీఠంపై దృష్టి సారించిన బీజేపీ ( Bjp ) వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ), కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ( Amit shah ) రోడ్ షోలు విజయ వంతమయ్యాయి. టీఎంసీ పార్టీ ( TMC ) కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు , క్రికెట్ దాదా సౌరవ్ గంగూలీ ( Saurav Ganguly ) విషయంలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను ( Jagdip Dhankhar ) హఠాత్తుగా , ప్రత్యేకమైన కారణం లేకుండా సౌరవ్ గంగూలీ కలవడమే ఊహాగానాలకు తెర లేపినట్టైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని..సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకోడానికి బీజేపీ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌తో దాదా భేటీ అవడం దేనికి సంకేతమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. గంగూలీ పార్టీలో చేరితే బీజేపీలో ఎన్నికల హీట్ కచ్చితంగా పెరుగుతుందనేది సగటు బీజేపీ కార్యకర్త చెబుతున్న మాట.

Also read: CLAT 2021 Notification: క్లాట్ 2021 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవే

Trending News