Covid-19 Policy: కోవిడ్-19 బీమా తీసుకున్నారా ? అయితే ఇది చదవండి, పలు మార్పులు చేయనున్న IRDAI

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెగుగుతుండటంతో ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలెప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించిన ప్రాకక్ట్ వ్యాలిడిటీని పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Last Updated : Sep 18, 2020, 11:04 PM IST
    • కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెగుగుతుండటంతో ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలెప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించిన ప్రాకక్ట్ వ్యాలిడిటీని పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
    • ఇలా చేయడానికి కారణం.. కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న పాలసీ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చడమే.
Covid-19 Policy: కోవిడ్-19 బీమా తీసుకున్నారా ? అయితే ఇది చదవండి, పలు మార్పులు చేయనున్న IRDAI

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెగుగుతుండటంతో ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలెప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించిన ప్రాకక్ట్ వ్యాలిడిటీని పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐఆర్ డీఏఐ చైర్మన్ సుభాష్ సీ ఖుంటియా ప్రకారం  IRDAI కోవిడ్-19 టీకా  ( Covid-19 Vaccine ) అందుబాటులోకి వచ్చేంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ ల గడువును పెంచే అవకాశం ఉంది. ఇలా చేయడానికి కారణం.. కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న పాలసీ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చడమే.
 ALSO READ: 
WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే

కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ ( CII ) జరిపిన వెబినార్ లో మాట్లాడిన ఐఆర్ డీఏఐ  చైర్మన్ సుభాష్ సీ ఖుంటియా కరోనా వైరస్ పై స్టాండర్డ్ ప్రాడక్ట్ తీసుకువచ్చే విషయంపై కూడా మాట్లాడారు. ఈ రోజుల్లో ప్రజలకు ఇలాంటి స్డాండర్డ్ పాలసీ అవసరం చాలా ఉంది అని ఆయన తెలిపారు. ఇలాంటి పాలసీలను ప్రజలు సులువుగా తీసుకోవచ్చు. దాంతో పాటు వీటిని కొనుగోలు చేయడానికి భారీ డాక్యుమెంటేన్,  భారీ విధానాలు అవసరం ఉండదు. సరళమైన విధానంలో వీటిని కొనుగోలు చేయవచ్చు. క్లెయిమ్ చేసే ప్రక్రియను కూడా సులభతరం చేయనున్నారు.

భారతదేశంలో ప్రభలుతున్న కోవిడ్-19 మహహ్మారి ( COVID-19 Pandemic ) ని గమనించి అన్ని జనరల్ హెల్త్ ఇన్సురెన్స్ సంస్థలు (Insurance Companies) కోవిడ్-19 భీమాను జులై 2020లో మార్కెట్ లో ప్రవేశ పెట్టాయి. వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలు రకాలు ప్లాన్ లు అందుబాటులోకి తెచ్చాయి. ఇందులో హాస్పిటల్ , చికిత్స ఖర్చులతో పాటు కొన్ని సంస్థలు నగదును కూడా అందజేసే ప్లాన్ లు అందుబాటులో తెచ్చాయి. తమ కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుకునేందుకు ప్రజలు ఈ పాలసీలను తీసుకుంటున్నారు .

ALSO READ: Aadhaar Lock & Unlock: మీ ఆధార్ దుర్వినియోగం అయిందా ? ఇలా లాక్ చేసి అన్ లాక్ చేయండి!

ఈ పాలసీలు మూడున్నర నెలల నుంచి తొమ్మదిన్నర్ నెలల వరకు కవరేజ్ ఉంటుంది. ఇందులో రూ. 5,00,000 వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంటుంది. కరోనా భీమా అనేది కంపన్సేషన్ బేస్ట్ ( Compensation-based ) ఒక బేసిక్ మ్యాన్డేటరీ కవర్. దాంతో పాటు మరో కవరేజ్ కూడా ఉంటుంది. అది లాభంపై ఆధారపడి ఉంటుంది.

బేసిక్ కవర్ లో రూ.50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉంటుంది. ఈ కవర్ మూడున్నర నెలల నుంచి ఆరు నెలల వరకు కవరేజ్ ఇస్తుంది. ఇందులో వెయిటింగ్ పిరియడ్ (Waiting Period) కూడా ఉంటుంది.  ప్లాన్ ప్రకారం 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు.

 ALSO READ:  Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News