ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేస్తే మంచి జాబ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మొత్తం 493 పోస్టులను ఐఓసీఎల్ భర్తీ చేయనుంది.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, ఎలక్ట్రిషన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, అకౌంటెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. తగిన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 54, తెలంగాణలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో జాబ్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో ఐఓసీఎల్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడలో కేటాయించారు. కేటగిరీల వారీగా చూస్తే జనరల్-239 పోస్టులు ఉండగా, ఈడబ్ల్యూఎస్-44, ఎస్సీ-72, ఎస్టీ-14, ఓబీసీ-14, పీడబ్ల్యూడీ-124 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
మొత్తం పోస్టులు: 493
- దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 27
- దరఖాస్తుల తుది గడువు : డిసెంబర్ 12
- ఎంపిక విధానం: రాతపరీక్ష
- పరీక్ష తేదీ: 2021, జనవరి 3
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
- అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేయాలి
- వయసు: అక్టోబర్ 31, 2020 నాటికి 24ఏళ్ల వయసులో ఉండాలి
వెబ్‌సైట్: https://iocl.com/
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe