అప్పటివరకు International flights నిషేధం

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. క‌రోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధం కొనసాగించకతప్పదని కేంద్రం నిర్ణయించింది.

Last Updated : Jul 31, 2020, 09:48 PM IST
అప్పటివరకు International flights నిషేధం

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. క‌రోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధం కొనసాగించకతప్పదని కేంద్రం నిర్ణయించింది. గతంలో జూలై 15 నుంచి 31 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించగా.. నేటితో ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ తాజాగా మరోసారి నిషేధాజ్ఞలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం ఆగ‌స్టు 31 వ‌ర‌కు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధం అమలులో ఉంటుంది. Also read: spurious liquor: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి

ఐతే, ఇంటర్నేషనల్ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని.. అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌కు, డీజీసీఏ ( DGCA) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని డీజీసీఏ వెల్లడించింది. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..

Trending News