Interest rates of Home loans: ఎస్బీఐ, ఐసిఐసిఐ, LIC HFL, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు

Interest rates of Home loans: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ (LIC HFL home loans interest rates) చేస్తుండగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్‌ (Kotak Mahindra home loans interest rates) పొందవచ్చు.

Written by - Pavan | Last Updated : Oct 7, 2021, 10:42 PM IST
Interest rates of Home loans: ఎస్బీఐ, ఐసిఐసిఐ, LIC HFL, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు

Interest rates of Home loans: హోమ్ లోన్స్‌కి డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో బ్యాంకులు సైతం కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు పోటాపోటీగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా హోమ్ లోన్స్‌పై (Home loans in Bank of Baroda) వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు గృహరుణాలపై అందించిన 6.75 శాతం వడ్డీ రేటులోంచి 0.25 శాతం వడ్డీ తగ్గించి 6.50 శాతం వడ్డీకే రుణాలు అందించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) స్పష్టంచేసింది. 

Home loans transfer - హౌజింగ్ లోన్స్ ట్రాన్స్‌ఫర్స్‌కి సైతం అదే వడ్డీ రేటు:
కొత్తగా రుణం తీసుకునే వారికే కాకుండా.. గతంలోనే ఇతర బ్యాంకుల నుంచి హౌజింగ్ లోన్స్ తీసుకుని ఆ రుణాలను బ్యాంక్ ఆఫ్ బరోడాకు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే వారికి సైతం ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయని పేర్కొంది. కొత్తగా తగ్గించిన వడ్డీ రేట్లు (Interest rates) తక్షణమే అమలులోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 

Processing fee waiver offer - అప్పటివరకు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఆఫర్:
కొత్తగా హోమ్ లోన్స్ తీసుకునే వారికైనా లేదా ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్స్ తీసుకుని ఆ రుణాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకునే వారికి కూడా ప్రాసెసింగ్ ఫీజు (Processing fee charges) నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టంచేసింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా  వెల్లడించింది.

Housing loans interest rates - హౌజింగ్ లోన్స్ వడ్డీ రేట్లు:
బ్యాంకులు పోటాపోటీగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గిస్తున్న నేపథ్యంలో ఏయే బ్యాంకులు ఇలా 7 శాతం వడ్డీ రేటులోపే హోమ్ లోన్స్ అందిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ (LIC HFL home loans interest rates) చేస్తుండగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్‌ (Kotak Mahindra home loans interest rates) పొందవచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 6.70 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ (ICICI bank home loans interest rates) అందిస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్స్‌కి 6.70 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుండగా (SBI home loans interest rates).. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80 వడ్డీ రేటు చార్జ్ (PNB home loans) చేస్తోంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x