Billionaires: వారెన్ బఫెట్ కాదు..ఇప్పుడు ముఖేష్ అంబానీ

భారతీయ పారిశ్రామిక దిగ్గజం మరోసారి ఖ్యాతినార్జించారు. సంపాదనలో తన ప్రపంచ ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో మరింత ముందుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వారెన్ బఫెట్ ( Warren Buffet ) ను దాటి  8వ  స్థానానికి చేరుకున్నారు.

Last Updated : Jul 11, 2020, 12:44 PM IST
Billionaires: వారెన్ బఫెట్ కాదు..ఇప్పుడు ముఖేష్ అంబానీ

భారతీయ పారిశ్రామిక దిగ్గజం మరోసారి ఖ్యాతినార్జించారు. సంపాదనలో తన ప్రపంచ ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో మరింత ముందుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వారెన్ బఫెట్ ( Warren Buffet ) ను దాటి  8వ  స్థానానికి చేరుకున్నారు.

బ్లూమ్‌బర్స్ బిలియనీర్స్ ఇండెక్స్ (  Bloomberg Billionaires Index ) తాజాగా విడుదల చేసిన సూచీలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం ప్రపంచంలో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సంస్థ ప్రతియేటా విడుదల చేసే ప్రపంచ ధనికుల జాబితాలో భారతీయ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ( Mukhesh Ambani )  8వ స్థానానికి చేరుకున్నారు. నిన్నటి వరకూ ఈ స్థానంలో వారెన్ బఫెట్ ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. 68.3 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ...67.9 బిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ ను దాటేశారు. ముఖేష్ ఇప్పుడు 8 వ స్థానానికి చేరుకోగా...వారెన్ బఫెట్ 9వ స్థానానికి పడిపోయారు. Also read: Covid 19: నెలాఖరుకు ఇండియా పరిస్థితి ఏంటి?

టాప్ 10 ప్రపంచ ధనికుల జాబితాలో  చేరిన తొలి ఆసియన్ టైకూన్ ( Asian Tycoon )  గా ముఖేష్ అంబానీ ఇప్పుుడు ఖ్యాతినార్జించారు. పేస్‌బుక్ ( Facebook ) , సిల్వర్ లేక్ ( Silver lake )  వంటి డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో ఇటీవలి కాలంలో రిలయల్స్ ఇండస్ట్రీస్ ( Reliance Industries ) పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. Alsor read:Govt Jobs 2020: ఎన్‌సీఈఆర్టీలో పలు పోస్టులకు నోటిఫికేషన్

అయితే ఇప్పటివరకూ 8వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ సంపద తగ్గడానికి కారణం 2.9 బిలియన్ డాలర్ల ను ఛారిటీ కోసం కేటాయించడమేనని బ్లూమ్‌బర్గ్  బిలియనీర్స్ ఇండెక్స్ (  Bloomberg Billionaires Index. ) వెల్లడించింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News