14వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

'కరోనా వైరస్'.. భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది.

Last Updated : Apr 18, 2020, 11:27 AM IST
14వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

'కరోనా వైరస్'.. భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది.

కరోనా వైరస్ విస్తరించకుండా .. దేశవ్యాప్తంగా  మార్చి 24  నుంచి విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. 

ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 14 వేల 378గా నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ ప్రకటించింది.  గత 24  గంటల్లో 991 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు  వెల్లడించింది. నిన్న ఒక్కరోజే  43 మంది చనిపోయారని వివరించింది. 

మొత్తంగా 14 వేల 378 పాజిటివ్ కేసుల్లో 11 వేల 906  కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో 1992 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిపింది. భారత దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు  480 మంది కరోనా వైరస్ మహమ్మారికి బలయ్యారని తెలిపింది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 31 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని 42 మంది  డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 15 మంది మృతి చెందారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News