మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే

లాక్‌డౌన్‌ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

Last Updated : May 5, 2020, 01:59 AM IST
మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది. అందరినీ ఒకేసారి తీసుకురావడం కుదరదు కనుక దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆయా దేశాల్లో పనిచేస్తోన్న భారత రాయబార కార్యాలయాలు భారత్‌కి తిరిగొచ్చే భారతీయుల జాబితాలను సిద్ధం చేసి కేంద్రానికి ఇవ్వగా... ఆ జాబితాలో ఉన్న వారి సంఖ్య, అక్కడి నుంచి వారిని భారత్‌కి తీసుకురానున్న మార్గాలను పరిశీలించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది.

Also read : మద్యం విక్రయాలు.. మందు బాబులకు కండిషన్స్

స్వదేశానికి తిరిగొచ్చే భారతీయుల కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. అందులో మొదటిది ఏంటంటే.. కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు లేని వారిని మాత్రమే ఈ ప్రయాణానికి అనుమతిస్తారు. అంతేకాకుండా స్వదేశాగమనం తర్వాత కూడా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ప్రయాణీకులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. భారత్‌కి తిరిగొచ్చిన అనంతరం కోవిడ్-19 పరీక్షలకు సహకరించి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 

Also read : గోధుమ పిండి సంచుల్లో నోట్ల కట్టల పంపిణీపై స్పందించిన అమీర్ ఖాన్‌

స్వదేశానికి తిరిగొచ్చి వాళ్లంతా ఆరోగ్య సేతు యాప్ ద్వారా వాళ్ల పేర్లను నమోదు చేసుకోవాలి. క్వారంటైన్ తర్వాత కూడా వారికి నెగటివ్ వస్తేనే వారిపై ఉండే ఆంక్షలు తొలగిపోతాయి. భారత్‌కి తిరిగొచ్చేందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రయాణికులే సొంతంగా భరించాల్సి ఉంటుంది. స్వదేశానికి తిరిగొచ్చే వారికోసం ఆయా రాష్ట్రాల్లోనే క్వారంటైన్‌కి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News