పాక్ వీసాకు దరఖాస్తు చేసుకున్న 23 మంది భారతీయుల పాస్‌పోర్ట్స్ అదృశ్యం !

కలకలం సృష్టిస్తున్న భారతీయుల పాస్‌పోర్ట్స్ అదృశ్యం !

Last Updated : Dec 15, 2018, 01:17 PM IST
పాక్ వీసాకు దరఖాస్తు చేసుకున్న 23 మంది భారతీయుల పాస్‌పోర్ట్స్ అదృశ్యం !

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఆధ్యాత్మిక పర్యటన కోసం 23 మంది భారతీయులు ఓ ఏజెంట్ ద్వారా పాక్ వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తాజాగా వారి వారి పాస్‌పోర్ట్స్ అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాస్‌పోర్ట్స్ జారీ చేసే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ లేఖ రాసినట్టు సమాచారం. అదృశ్యం అయిన పాస్‌పోర్ట్స్ దుర్వినియోగం అవకముందే పాస్‌పోర్ట్స్ అదృశ్యం వ్యవహారంపై త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్ట్స్ జారీ చేసే విభాగాన్ని కోరినట్టు ఏఎన్ఐ వెల్లడించింది. పాస్‌పోర్ట్స్ అదృశ్యానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Trending News