Indian Railways: కరోనా మహమ్మారి కట్టడికి రైల్వే శాఖ కీలక నిర్ణయం

Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2021, 05:12 PM IST
Indian Railways: కరోనా మహమ్మారి కట్టడికి రైల్వే శాఖ కీలక నిర్ణయం

Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.

ఇండియాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజూ 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా నిబంధనల్ని(Corona Guidelines) పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఈ నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ ( Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా పలు ఆంక్షలు విధించింది. ప్రయాణీకులు మాస్క్ ధరించకపోయినా..రైళ్లు, స్టేషన్లలో ఉమ్మేసినా 5 వందల రూపాయల జరిమానా విధిస్తోంది. 

రైల్వే శాఖ విధిస్తున్న ఈ ఆంక్షలు ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ప్రారంభం కావడంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయంతో వలస కార్మికులు ( Migrant labour) ఇళ్లకు పయనమవుతున్నారు. కరోనా వ్యాప్తి అత్యథికంగా ఉన్న ప్రాంతాల్నించి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న తరుణంలో రైల్వే శాఖ ఈ చర్యలు తీసుకుంది. అటు సొంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ఆయా ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

Also read: Maha Kumbhmela: కుంభమేళాపై ముంబై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News