రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక రైలు

రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ' శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ ప్రత్యేక రైలు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 

Last Updated : Jul 11, 2018, 08:24 PM IST
రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక రైలు

శ్రీరాముడి భక్తులకు శుభవార్త. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా రైల్వేశాఖ ‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ ప్రత్యేక రైలును నడపనుంది. దీని కోసం టూర్ ప్యాకేజ్ ను రూపొందించింది.  మొత్తం 16 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 800 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ కు వెళ్లాలంటే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15 వేల 120 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజనం, వసతి  సదుపాయలన్నీ కల్పిస్తారు.  

స్వదేశీ ప్రయాణం
నవంబర్ 14న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి బయలుదేరనుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. యూపీలోని అయోధ్యలో ఈ రైలు తొలిస్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ,  శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ మీదుగా రామేశ్వరం చేరుతుంది.

శ్రీలంక ప్రయాణం
రామాయణంలో శ్రీలంక దేశంలోని కొన్ని ప్రాంతాల గురించి కూడా ప్రస్తావనకు వస్తుంది. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల మీదుగా కూడా ప్రయాణం సాగుతుంది. అయితే ఇందుకు  ప్రత్యేక ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తుంది. కాగా శ్రీలంకలోని ఆయా ప్రాంతాలను కూడా సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

 

 

Trending News