Indian Railways: ఎక్కడికైన వెళ్లాలంటే ముఖ్యంగా దూర ప్రయాణాల కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చేది రైలు ప్రయాణానికే. రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునే విధానం అందరికీ తెలిసిందే. కావాలంటే, మీరు మొత్తం రైలును కూడా బుక్ చేసుకోవచ్చు. అవునండి మేము చెప్పేది నిజం.. 2-4 బెర్త్ లు మాత్రమే కాదు ఏకంగా రైలునే బుక్ చేసుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం!
50 వేలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ఒకవేళ మీకు రైలు మొత్తం బుక్ చేసుకోవాలి అని ఉంటే.. సమీపంలోని రైల్వే స్టేషన్ కి వెళ్లండి, అది కూడా పెద్ద రైల్వే స్టేషన్ అయి ఉండాలి. అక్కడ స్టేషన్ మాస్టర్ కు బుకింగ్ అప్లికేషన్, మీ కార్యక్రమంతో పాటు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ లో ఏ సమయంలో రైలు అవసరమో, ఏ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందో తెలియజేయాల్సి ఉంటుంది
18 కోచ్ ల రైలు బుకింగ్ పద్దతి
ఇలా పూర్తిగా ఒక రైలును బుకింగ్ చేసుకోవాలని ఉంటే.. మీరు 18 కోచ్ ల రైలును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేవలం 5-7 కోచ్ ల రైలు బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది వీలుపడదు. ఒకవేళ 18 కోచ్ లు ఉన్న ఒక రైలను బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ మరియు సెక్యూరిటీ ఛార్జీ కలిపి ఏకంగా రూ. 9 లక్షలు చెల్లించాలి. ఇవే కాకుండా అదనంగా సర్వీస్ ఛార్జ్, సేఫ్టీ ఛార్జీ మరియు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి.
ప్రయాణీకుల జాబితా
ఒకవేళ రైలును బుక్ చేసుకుంటే.. ప్రయాణానికి కనీసం 72 గంటల ముందు స్టేషన్‌లోని చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ కు ప్రయాణికుల జాబితాను ఇవ్వాలి. రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరి వివరాలను అందజేసిన తరువాత.. ఒక్కొక్కరికి టికెట్ జారీ చేయబడుతుంది. రైలు బుక్ చేసుకున్నప్పటికీ, ప్రయాణికులు అందరు వారి వారి టికెట్లను ప్రయాణ సమయాల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
7 రోజుల కంటే ఎక్కువ ప్రయాణానికి అదనపు ఛార్జీ
ఒకవేళ మీ ప్రయాణ వ్యవధి 7 రోజుల కంటే ఎక్కువ ఉంటే, మీరు ఒక్కో కోచ్‌కు 10 వేల రూపాయల అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు డిపాజిట్ చేసిన తర్వాత, దరఖాస్తును భారతీయ రైల్వే యొక్క చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ (CPTM)కి సమర్పించాలి. కానీ ఇది ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 30 రోజుల ముందు ఇవ్వాలి. లేకపోతే, రైలు బుకింగ్ ప్రక్రియ చేయలేము.
Aslo Read: మలద్వారంలో లాఠీలు జొప్పించి చిత్రహింసలు..? సీఐ థర్డ్ డిగ్రీతో యువకుడి ఆత్మహత్య..
Aslo Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషి పెరారివాలన్‌కు సుప్రీం బెయిల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Indian Railways: ఒకటి, రెండు కాదు ఏకంగా పూర్తిగా రైలునే బుక్ చేసుకోవచ్చు.. అదెలాగంటారా.. ??
కేవలం 2-4 సీట్లు మాత్రమే కాకుండా రైలు మొత్తం బుక్ చేసుకోవచ్చు.
దీనికోసం మీరు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
పూర్తి రైలు బుకింగ్ కోసం చాలా వరకు ఖర్చు అవ్వొచ్చు.