Indian Railways Bearth Rules: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా..? అయితే ఈ వార్తా మీకోసమే.. టికెట్ బుక్ చేసే సమయంలో బెర్త్ ఎంచుకునే అవకాశం మనకు ఉన్నప్పటికీ మనకు నచ్చిన బెర్త్ పొందే అవకాశం లేదు. బుకింగ్ సమయంలో నచ్చిన సీట్లు ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, కచ్చితంగా అవే మనం పొందుతామనే నమ్మకం లేదు.. కానీ ఇపుడు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ బెర్తులకు సంబంధించి కఠిన నిబంధనలను రూపొందించింది. ప్రయాణానికి టికెట్ బుక్ చేసే ముందు ఈ నియమ నిబంధనలను తెలుసుకోవటం చాలా మంచిది.
మిడిల్ బెర్త్
రైలు ప్రయాణంలో మిడిల్ బెర్త్ వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కింద బెర్త్ వాళ్లు రాత్రి వరికి కూర్చొని ఉంటే మనం వారిని పడుకోమని చెప్పలేము.. అలాగని వారు కూర్చున్నపుడే మిడిల్ బెర్త్ తీసి పడుకోలేము.. అయితే మిడిల్ బెర్త్ పొందిన వారికి రూల్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆ రూల్స్ గురించి ఇపుడు మనం తెలుసుకుందాం.
మిడిల్ బెర్త్ నియమాలు..
ప్రయాణం ప్రారంభమైన వెంటనే కొంత మంది వారికి కేటాయించిన మిడిల్ బెర్త్ తీసి పడుకుంటారు. దీని వలన ఇతర ప్రయాణికులకు కూర్చోవటానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కావున మిడిల్ బెర్త్ పొందిన వ్యక్తి కేవలం రాత్రో 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకుయ్ మాత్రమే మిడిల్ బెర్త్ ను తెరచి పడుకోవచ్చు.. అంటే ఒక ప్రయాణికుడు రాత్రికి 10 గంటల ముందు మిడిల్ బెర్త్ ను వాడటాన్ని మీరు ఆపవచ్చు.
అదే సమయంలో ఉదయం 6 గంటల తరువాత ఇతర ప్రయాణికులు దిగువ బెర్త్ పై కూర్చోటానికి మిడిల్ బెర్త్ ను మూసేయాలి. కానీ కొన్ని సార్లు కింద బెర్త్ వాళ్లు ఆలస్యంగా మేల్కొంటారు అపుడు మిడిల్ బెర్త్ వారికి ఇబ్బంది కరంగా ఉంటుంది. నియమాల ప్రకారం 10 గంటలకు మీరు మీ సీటును తీసుకోవచ్చు.
కొన్ని సార్లు రైలులో ఉన్న టీటీఈ మీరు గాఢ నిద్రలో ఉన్నపుడు మీ టికెట్ చెక్ చేస్తూ మీ ఐడిని చూపించమంటారు. కానీ నియమాల ప్రకారం, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో మాత్రమే టికెట్ మరియు ఐడిని చెక్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటల తరువాత ఏ ప్రయాణికుడికి అంతరాయం కలిగించే అవకాశం టీటీఈకి లేదు.
రైలులో రాత్రి పడుకున్న తరువాత ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు. కానీ రాత్రి 10 గంటల తరువాత ప్రయాణం ప్రారంభించే వారికి ఈ నియమాలను వర్తించవు.
Also Read: AP CRDA: జగన్ సర్కారుకు హై కోర్టులో షాక్- సీఆర్డీఏ పక్కాగా అమలు చేయాల్సిందే!
Also Read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook