మే 3 వరకు రైళ్లు బంద్

అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజమైంది. 'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రేపు విడుదల చేస్తామని చెప్పారు.

Last Updated : Apr 14, 2020, 12:03 PM IST
మే 3 వరకు రైళ్లు బంద్

అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజమైంది. 'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రేపు విడుదల చేస్తామని చెప్పారు. 

మరోవైపు కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 37 వేల రైళ్లు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా సర్వీసులు నిలిపివేశాయి. నిజానికి అంతా ఈ రోజు ( ఏప్రిల్ 14)తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి రైళ్ల సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని సోషల్  మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఐతే ఇది సరైన సమాచారం కాదని రైల్వే మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. 

మరోవైపు లాక్ డౌన్ మే 3 వరకు పొడగించడంతో .. రైల్వే సర్వీసుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఐతే దీనిపై స్పెక్యులేషన్లు  జరగకముందే రైల్వే మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.  మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  పొడగించిన కారణంగా రైళ్ల  రాకపోకలు ఉండవని.. అప్పటి వరకు ప్యాసింజర్ సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News