Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

Indian Railways extends special train services: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టి అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ప్రస్తుతం అందిస్తున్న రైలు సేవలకు తోడు తాజాగా మరో 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2021, 07:40 AM IST
Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

Indian Railways extends special train services: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టి అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ప్రస్తుతం అందిస్తున్న రైలు సేవలకు తోడు తాజాగా మరో 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో రైలు సర్వీసులను పరిమితం చేసిన ఇండియన్ రైల్వేస్ (Indian Railways).. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని దశల వారీగా రైళ్ల సర్వీసుల సంఖ్య కూడా పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే మరో 24 రైలు సర్వీసులను జోడిస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South central Railway) వెల్లడించింది. 

తెలుగు రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లతో ప్రయోజనం కలగనుందని సౌత్ సెంట్రల్ రైల్వై పీఆర్వో తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ 24 స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలంటే ముందుగా తమ టికెట్ రిజర్వ్ (Train ticket booking rules) చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 

Also read : Telangana COVID-19 updates: తెలంగాణ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్

కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రైళ్లలో ఆరు రైళ్లు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుండగా.. మరో 18 రైళ్లు (Special trains) వారంలో ఒకసారి రాకపోకలు సాగిస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Also read : Telangana high court: Schools reopening పై తెలంగాణ సర్కారుకు హై కోర్టు ప్రశ్నలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News