New Ticket Booking Rules: రైల్వే ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే కీలకమైన అప్‌డేట్ ఇస్తోంది. రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో ఇప్పటివరకూ ఉన్న కొన్ని నియమాల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రయాణీకులకు ఓ వెసులుబాటు..అవేంటో చూద్దాం..
మీరు తరచూ రైలు ప్రయాణం చేసేవారైతే ఇది మీకు ముఖ్యమైన వార్తే. భారతీయ రైల్వే ఇప్పుడు టికెట్ బుకింగ్ నియమాల్లో మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా టికెట్ బుకింగ్ తక్కువ సమయంలోనే పూర్తి చేయవచ్చు. ఇప్పుడిక టికెట్ బుక్ చేసేటప్పుడు డెస్టినేషన్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
రైల్వే శాఖ ఆదేశాలు
కరోనా మహమ్మారి సమయంలో రైల్వేలో కొత్తగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ మార్పుల్ని తొలగిస్తున్నారు. మరోసారి కొత్త మార్పులు తెస్తున్నారు. కరోనా సమయంలో వచ్చిన మార్పుల కారణంగా నిన్నటి వరకూ రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు డెస్టినేషన్ అడ్రస్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో ఐఆర్‌సీటీసీ ఆ నిబంధన తొలగించింది. ఇకపై డెస్టినేషన్ అడ్రస్ అవసరం లేదు. కోవిడ్ సమయంలో కేవలం ఇదొక్కటే కాదు చాలా నియమాలుండేవి. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఎవరైనా ప్రయాణీకుల్లో ఉన్నట్టు తేలితే..ఆ వ్యక్తిని ట్రేస్ చేయడంలో ఉపయోగపడుతుందని డెస్టినేషన్ అడ్రస్ తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. ఇప్పుడు తిరిగి పరిస్థితి సాధారణం కావడంతో ఒక్కొక్కటిగా నిబంధనల్ని తొలగిస్తున్నారు.
రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఇకపై టికెట్ బుకింగ్ సమయం కూడా తగ్గుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని రైల్వేజోన్లకు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు రైల్వే టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌లలో కూడా మార్పులు చేయనుంది. ఇటీవల ఏసీ కోచ్‌లలో పిల్లో, దుప్పటి సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించింది రైల్వేశాఖ. కరోనా మహమ్మారి కారణంగా ఈ సౌకర్యాన్ని రైల్వే నిలిపివేసింది. ఇప్పుడు తిరిగి ఆ సేవల్ని అందించడం ప్రారంభించింది.
Also read: India Corona Update: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook