Indian Railway Rules: రైల్వే ప్రయాణీకుల రక్షణ, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నిబంధనలు రూపొందిస్తుంటుంది. దానినే రైల్వే మేన్యువల్ అంటారు ఈ మేన్యువల్ ప్రకారం రైల్వే టీటీలకు కూడా ప్రత్యేక అధికారాలుంటాయి. టికెట్ లేని ప్రయాణీకుల్నే కాదు..కొన్ని సందర్భాల్లో టికెట్ ఉన్న ప్రయాణీకుల్ని కూడా ట్రైన్ నుంచి దింపే అధికారం టీటీలకు ఉంటుందంటే నమ్మలేకున్నారా..కానీ ఇది నిజం
రైల్వే మేన్యువల్ నిబంధనల్లో రైల్వే టీటీలకు ప్రత్యేక అధికారాలున్నాయి. ఈ నిబంధనల్లో రైల్వే ప్రయాణీకులకు సైతం సౌకర్యాలు, సేఫ్టీ ఇవ్వబడ్డాయి. ఈ నిబంధనలు పాటించకపోతే రైల్వే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముంది. రైలు ప్రయాణం ప్రారంభించేముందు లేదా ప్రయాణం మధ్యలో ప్రయాణీకుడి ఆరోగ్యం సరిగ్గా లేదని టీటీ భావిస్తే, అతను ప్రయాణం చేయలేడని అనుకుంటే మార్గమధ్యలో ఇబ్బందులు ఎదురౌతాయి. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ఉన్నా సరే ఆ ప్రయాణీకుడిని రైల్వే టీటీ అతని సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రైన్ నుంచి దింపేయగలడు. ఆ ప్రయాణీకుడికి ఫస్ట్ క్లాస్ లేదా జనరల్ కేటగరీ టికెట్ ఏది ఉన్నా దింపేయగలడు.
రైల్వే శాఖ ఈ నిబంధనల్ని ప్రయాణీకుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని విధించింది. ఒకవేళ ప్రయాణీకుడి ఆరోగ్యం బాగాలేదని టీటీ గుర్తిస్తే, ప్రయాణంలో అతని ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉండేందుకు అతను తగిన చర్యలు తీసుకోగలడు. తక్షణం ఆ ప్రయాణీకుడికి తగిన వైద్య సహాయం అందించకపోతే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. ఇది తెలిసి కూడా టీటీ తగిన చర్యలు తీసుకోకపోతే టీటీ నిర్లక్ష్యం అవుతుంది. అందుకే టీటీ తగినంత అప్రమత్తంగా ఉండాలి.
Also read: AP Election Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదికారం ఆ పార్టీదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook