న్యూఢిల్లీ : కరోనా వైరస్ (Coronavirus) కోరలు చాస్తోంది. శుక్రవారం సాయంత్రానికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల (Coronavirus posotive cases) సంఖ్య 236 దాటగా.. ఐదుగురు కరోనా కాటుకు (COVID-19 deaths in India) బలయ్యారు. కోవిడ్-19 వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అవగాహనలేమితో ప్రజలు ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అవగాహనారాహిత్యంతో చేస్తున్న తప్పుల కారణంగానే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోందనే (Coronavirus spread) విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనావైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు నడుం బిగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎప్పటికప్పుడు ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నాయి.
Read also : జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
అందులో భాగంగానే ఇప్పటికే హెల్స్‌లైన్ నంబర్లను (Helpline numbers) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా వాట్సాప్‌లో కరోనా వైరస్ నివారణకు సంబంధించిన అన్ని వివరాలు అందించేందుకు ఓ వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, ఇతర సందేహాలకు సమాధానాలు ఈ వాట్సాప్ బోట్ ద్వారా తెలుసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మై గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ (My Gov chat boat whatsapp number) సేవల వివరాలను ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
Prepare, Don’t Panic: Government launches MyGov Corona Helpdesk on WhatsApp for alerting citizens & disseminating information.
Citizens can now send ‘Hi’ on WhatsApp to +91 9013151515 and get automated responses to queries related to Coronavirus. #IndiaFightsCorona pic.twitter.com/6gZZvDVM0g
— Piyush Goyal (@PiyushGoyal) March 20, 2020
Read also : కరోనాపై గర్భవతులకు శుభవార్త.. ఆ ఆందోళన అక్కర్లేదు
మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ (My Gov Corona helpdesk) పేరిట 90131 51515 వాట్సాప్ నెంబర్‌తో ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈ వాట్సాప్ చాట్ బోట్ ద్వారా మీరు కరోనా వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టంచేసింది. అందుకు మీరు చేయాల్సిందల్లా.. పై మొబైల్ నెంబర్‌ను మీ ఫోన్లలో సేవ్ చేసుకుని.. వాట్సాప్‌లో మీ సందేహాన్ని అడగడమే. అందుకు సంబంధించిన సమాచారంతో కూడిన లింకును ఈ కింది విధంగా మై గవ్ చాట్ బోట్ వెంటనే మీ మొబైల్ ఫోన్‌కు ఫార్వాడ్ చేస్తుంది.