India Corona Cases Latest News | కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారత్‌లో తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగోరోజు ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దిగువన నమోదయ్యాయి. 6 వేలకు పైగా మరణాలు సంభవించడం నిన్న ఆందోళనను పెంచింది. నిన్నటితో పోల్చితే నేడు కోవిడ్19 మరణాలు సగానికి రావడం గమనార్హం. కరోనా రికవరీ రేటు 95 శాతానికి చేరుకుంది.
ఇండియాలో గత 24 గంటల్లో (గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు) 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వారం అంతా లక్ష దిగువన పాజిటివ్ కేసులు (India Corona Positive Cases) రావడం ఊరటనిస్తోంది. తాజా కేసులతో కలిపితే దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,92,74,823 (2 కోట్ల 92 లక్షల 74 వేల 823) మంది కరోనా బారినపడ్డారు. నిన్న ఒక్కరోజు 3,403 కోవిడ్19 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటివరకూ 3,63,079 (3 లక్షల 63 వేల 79 మంది) చనిపోయారు.
Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన
India reports 91,702 #COVID19 cases, 1,34,580 discharges & 3,403 deaths in last 24 hrs, as per Health Ministry
Total cases: 2,92,74,823
Total discharges: 2,77,90,073
Death toll: 3,63,079
Active cases: 11,21,671Total vaccination: 24,60,85,649 pic.twitter.com/0wrWOFIe29
— ANI (@ANI) June 11, 2021
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,34,580 (1 లక్షా 34 వేల 5 వంద 80) మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ దేశంలో మొత్తం 2,77,90,073 (2 కోట్ల 77 లక్షల 90 వేల 73) మంది కోవిడ్-19 (Covid-19) మహమ్మారిని జయించారు. దేశంలో ప్రస్తుతం 11,21,671 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇండియాలో ఇప్పటివరకూ 24 కోట్ల 60 లక్షల 85 వేల 649 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook