COVID 19 CASES INDIA:దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. భయపెడుతున్న పాజిటివిటి రేట్.. ఫోర్త్ వేవ్ అలెర్ట్!

COVID 19 CASES INDIA: దేశంలో కొవిడ్ మళ్లీ భయపెడుతోంది. నిన్నటి పోల్చితే భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8 వేల 822  కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే దాదాపు రెండు వేలు అధికం.  కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నకేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య యాబై వేలు దాటింది. 

Written by - Srisailam | Last Updated : Jun 15, 2022, 09:48 AM IST
  • దేశంలో కొవిడ్ కల్లోలం
  • కొత్తగా 8822 కొత్త కేసులు
  • 53 వేలు దాటిన యాక్టివ్ కేసులు
COVID 19 CASES INDIA:దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. భయపెడుతున్న పాజిటివిటి రేట్.. ఫోర్త్ వేవ్ అలెర్ట్!

COVID 19 CASES INDIA: దేశంలో కొవిడ్ మళ్లీ భయపెడుతోంది. నిన్నటి పోల్చితే భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8 వేల 822  కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే దాదాపు రెండు వేలు అధికం.  కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నకేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య యాబై వేలు దాటింది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53 వేల 637కు పెరిగింది. 

 కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా రిపోర్టు ప్రకారం గత 24 గంట్లలో వైరస్ భారీన పడి మరో 15 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5 లక్షల 24 వేల 792కు పెరిగింది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉండగా.. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Read also: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీలోకి సోను సూద్, ప్రకాష్ రాజ్! పీకేకు ఉత్తరాది బాధ్యతలు.. ?

Read also: Green India Challenge: ఐదోవిడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్, ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News