India Covid-19 update: దేశంలో కరోనా కేసులు సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. తాజాగా 2,323 కేసులు (Corona cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజే 2,346 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి శాతం 98.75శాతం ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,03,325కి చేరగా, మెుత్తం మరణాల సంఖ్య 5,24,348గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 14,996 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 4,99,382 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శుక్రవారం 15,32,383 మందికిపైగా టీకాలు (Covid-19 Vaccination in India) వేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,92,12,96,720కు చేరింది. వరల్డ్ వైడ్ గా కూడా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,59,996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనాతో మరో 1,360 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో కరోనా కేసులు భారీ స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. నిన్న 98వేలకుపైగా కేసులు నమోదవ్వగా... 244 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మెుత్తం కొవిడ్ కేసుల సంఖ్య 52,63,80,831కు చేరింది. మరణాల సంఖ్య 62,98,703గా ఉంది.
Also read: CBI raids: వదల బొమ్మాళీ అంటున్న సీబీఐ.. జాబ్ స్కామ్ కేసులో లాలూ నివాసంలో సోదాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook