ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అనంతరం మీడియాతో కేసీఆర్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అనంతరం మీడియాతో కేసీఆర్

Last Updated : Dec 23, 2018, 08:04 PM IST
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అనంతరం మీడియాతో కేసీఆర్

భువనేశ్వర్: దేశ రాజకీయాల్లో మార్పు అవసరం ఎంతైనా వుంది. అందుకే ఇవాళ మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం. చర్చలు ఇప్పుడే మొదలయ్యాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు మేమిద్దరం మరోసారి కలుస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఆదివారం సాయంత్రం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన అనంతరం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఓ శక్తిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Trending News