India Covid Cases: భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా పెరిగిన కరోనా ఉధృతి నేపథ్యంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,688 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 29న 4.96 లక్షల మందికి పైగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. గురువారం (ఏప్రిల్ 28)తో పోలిస్తే శుక్రవారం 300 కేసులు పెరిగనట్లు తెలుస్తోంది.
దీంతో దేశంలో 18,684 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2,755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు కంటే రికవరీలు తక్కువగా ఉండడం గమనార్హం. కరోనా ధాటికి మరో 50 మంది మృత్యువాత పడ్డారు. ఈ మరణాల్లో 45 కేరళలో సంభవించడం గమనార్హం.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/wQJRqmz6Xf pic.twitter.com/dVXgg6qkLC
— Ministry of Health (@MoHFW_INDIA) April 30, 2022
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 1,600 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేట్ ఢిల్లీలో 5.28 శాతానికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,609కి ఎగబాకింది.
ALso Read: Record Heat Wave In Delhi: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!!
Also Read: Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన తమిళనాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
India Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మరణాలు నమోదు!