India Corona Cases Live Updates: భారత్‌లో తగ్గుతున్న కరోనా ఉధృతి, భారీగా పెరిగిన డిశ్ఛార్జ్ కేసులు

India Corona Cases Live Updates: కరోనా వ్యాక్సినేషన్ అంత వేగవంతం కాకపోయినా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా కోవిడ్19 కేసులు 2 లక్షల దిగువన నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 30, 2021, 10:50 AM IST
  • భారత్‌తో గడిచిన 24 గంటల్లో మరోసారి తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
  • తాజాగా 1,65,553 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • మరో 3,460 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కరోనా మరణాలు 3,25,972
India Corona Cases Live Updates: భారత్‌లో తగ్గుతున్న కరోనా ఉధృతి, భారీగా పెరిగిన డిశ్ఛార్జ్ కేసులు

India Corona Cases Live Updates: భారత్‌లో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోంది. దేశ వ్యాప్తంగా ఒకరోజులో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు గత నెలన్నర రోజులలో కనిష్టంగా నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు కోవిడ్19 కేసులు 2 లక్షల దిగువన రావడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్, కర్ఫ్యూలు ప్రభావం చూపుతున్నాయి.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 20,63,839 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 1,65,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెలన్నర కాలంలో అతి తక్కువ కరోనా కేసులు ఇవే. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడిన వారి సంఖ్య 2,78,94,800 (2 కోట్ల 78 లక్షల 94 వేల 8 వందలు)కు చేరుకుంది. మరోవైపు కరోనా మరణాలు తగ్గడం లేదు. కోవిడ్19తో పోరాడుతూ తాజాగా మరో 3,460 మంది ప్రాణాలు కోల్పోగా, దేశంలో మొత్తం కరోనా మరణాలు 3,25,972కి చేరుకుంది.

Also Read: 2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 34,31,83,748 (34 కోట్ల 31 లక్షల 83 వేల 748) శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,76,309 (2 లక్షల 76 వేల 3 వందల 9) మంది కరోనాను జయించారు. దేశంలో ఇప్పటివరకూ కోవిడ్-19 (COVID-19) మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,54,54,320 (2 కోట్ల 54 లక్షల 54 వేల 320)కు చేరుకుంది.

Also Read: Boris Johnson Wedding: ప్రియురాలిని వివాహం చేసుకున్న UK PM బోరిస్ జాన్సన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News