India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

India Corona Cases: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దాదాపుగా వారం రోజుల నుంచి కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 2,858 మందికి కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు కరోనా ధాటికి మరో 11 మంది మరణించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 10:55 AM IST
India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

India Corona Cases: భారతదేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,80,000 మందికిపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 2,858 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పాయారు. అయితే మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి వారి కంటే.. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారే ఎక్కువగా ఉండడం విశేషం. 

కరోనా నుంచి తాజాగా 3,355 మంది కోలుకున్నారు. దీంతో పాటు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 18,096కు తగ్గిపోయింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 0.04 శాతానికి చేరుకుంది. 

భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు 4.31 కోట్లకు పైగా నమోదయ్యాయి. కరోనా ధాటికి ఇప్పటి వరకు 5.24 లక్షల మందికి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కూడా జోరందుకుంది. గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా.. ఇప్పటి వరకు 191 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Also Read: Delhi Fire Accident Tragedy: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 26కి చేరిన మృతుల సంఖ్య.. 12 మందికి గాయాలు

Also Read: Jammu Kashmir Bus Fire: వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సులో మంటలు..నలుగురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News