ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ

ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

Last Updated : Aug 15, 2018, 09:39 AM IST
ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ

ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఎవరెస్టు మీద చిన్నారులు జెండాను ఎగురవేసి మువ్వన్నెల జెండాకు మరింత వన్నె తీసుకువచ్చారని తెలిపారు. నవ చైతన్యం, నూతన చైతన్యంతో దేశం పురోగమిస్తుందని వెల్లడించారు. 12 ఏళ్లకోసారి వికసించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోందన్నారు. జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లని, సమరయోధులకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నానన్నారు. దేశ సేవలో ఉన్న త్రివిధ దళాలు, పోలీసులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారన్నారు. ఇవాళ దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని.. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందని మోదీ పేర్కొన్నారు.

పేదలు, దళితులు, వెనకబడిన వర్గాల సమస్యలపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ సాగిందన్న మోదీ.. దేశం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయని.. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నానన్నారు. దేశంలో వర్షాలు పడుతున్నాయన్న శుభవార్త ఒకవైపు ఉందని, మరోవైపు వరదలు వస్తున్నాయన్న బాధ కలుగుతోందన్నారు.

మోదీ ప్రసంగం హైలెట్స్

  • తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి కలలుగన్న భారతాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది
  • గిరిజన, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములు అయ్యేందుకు కృషి చేస్తున్నాము
  • 125 కోట్ల మంది భారతీయులు ఏకతాటిపై నడిచి ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం
  • దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని ప్రపంచంలోని మేధావులు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు వారే బలపడుతోందని పొగుడుతున్నారు  
  • భారత్ మల్టీ ట్రిలియన్ పెట్టుబడుల నిలయంగా మారింది.. ఉత్పత్తి రంగంలో వేగం పుంజుకుంది
  • భారతదేశం ఏనుగులా పడుకోలేదు.. మేల్కొంది, పరుగులు మొదలుపెట్టింది
  • వచ్చే 30ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే శక్తిగా దేశం మారుతుంది
  • పేదలకు జన్ ధన్ అకౌంట్లు కల్పించాం. డిజిటల్ ఇండియాకు నాందిపలికాం
  • దేశం గత నాలుగేళ్లగా అభివృద్ధి పథంలో సాగుతోంది
  • టీమిండియా స్వప్నం సాకారం లక్ష్యంగా అడుగులు వేస్తోంది
  • ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాలన్న లక్ష్యానికి దగ్గరలో  ఉన్నాం
  • సెప్టెంబర్ 25వ తేదీ  నుంచి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకం ప్రారంభం
  • ప్రతి ఒక్కరి ముఖ్యంలో చిరునవ్వు చిందించడానికి ముందుకు సాగుతున్నాం
  • 2022నాటికి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపిస్తాం.
  • దేశంలో మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న రాక్షసులకు భయం మొదలైంది.
  • ముస్లిం సోదరీమణులకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కలిగిస్తాం
  • జమ్మూకాశ్మిర్ విష్యంలో వాజ్ పేయి చూపించిన మార్గంలో సాగుతున్నాం. 

 

 

 

Trending News