Income Tax Returns: కొన్ని రోజుల్లో సంవత్సరం ముగియనుంది. సంవత్సరం ముగుస్తుండడంతో కొన్ని ఆర్థిక పరమైన విషయాలు కూడా మారుతుంటాయి. ఈ సమయంలో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త సంవత్సరంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఆదాయపు పన్నుకు సంబంధించిన ఓ అంశం ఉంది. అది పూర్తి చేయకపోతే రూ.10 లక్షల భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల్లారా అలర్ట్. అదేమిటో.. ఏం చేయాలో తెలుసుకోండి.
Also Read: Chandrababu: కబ్జారాయుళ్లకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. కబ్జా చేస్తే జైలుకే!
విదేశీ ఆదాయం, ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అది ఈనెల 31వ తేదీలోగా వెల్లడించాల్సి ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఇది చెల్లించకపోతే పన్ను చెల్లింపుదారులు నల్లధనం (బ్లాక్ మనీ) చట్టం భారీ జరిమానాలు.. కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాలు ప్రజలందరూ వెల్లడించాల్సిని కాదు. ఎవరైతే జూలైలో పన్ను చెల్లించలేదో వారు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది.
Also Read: Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం
ఆదాయపు పన్ను చెల్లించడానికి జూలై 31వ తేదీ 2024 ఆఖరి తేదీ. అయితే ఆ తేదీకి పన్నులు చెల్లించని వారు ఆలస్యమైన రిటర్న్‌ను ఈనెల 31వ తేదీలోపు ఫైల్ చేయాలి. ఆలస్యంగా పన్ను చెల్లిస్తున్నందుకు రూ.5 వేల అపరాధ రుసుము చెల్లించాలి. ఈ చెల్లింపును ఆలస్యమైన ఆదాయపు పన్ను అంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (1) కింద ఇది వర్తిస్తుంది. గడువు తేదీకి లేదా అంతకుముందు చెల్లింపులు చేయని ఆదాయాన్ని ఇది సూచిస్తుంది. 139 (4) కింద ఆలస్యమైన ఆదాయంగా పరిగణించబడుతుంది. జూలై 31వ తేదీకి 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయానికి వారి వ్యక్తిగత లేదా కార్పొరేట్ ఆదాయపు పన్ను రిటర్న్‌ను అంచనా వేసి దాఖలు చేసి ఉండాలి.
పన్ను చెల్లింపు చేయని వారు ఆలస్యంగా దాఖలు చేయడానికి ఇచ్చిన గడువు ఈనెల 31వ తేదీ. ఈ తేదీలోపు మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. చేయకపోతే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. వెంటనే ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అయ్యి పన్ను చెల్లించండి. పన్ను చెల్లించండి పన్ను ఎగవేతదారులుగా మిగలకండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter