'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా.. !
నిత్యం కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న అలాంటి వారికి కరోనా వైరస్ సోకకుండా మాస్కులు, గ్లౌజులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ.. ఎక్కడా మాస్కులు అందుబాటులో లేకుండా పోయాయి. మరోవైపు మాస్కుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండే ఇందుకు కారణం. దీంతో రూర్కీలోని ఐఐటీ ఓ అడుగు ముందుకేసింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కోసం తక్కువ ధరలో ఉండే ఫేస్ షీల్డ్ లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పుడు ఇవే ఫేస్ షీల్డ్ లను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వినియోగిస్తున్నారు. అతి తక్కువ ధరలో అందరికీ ఈ ఫేస్ షీల్డులు అందుబాటులో ఉంటాయని రూర్కీ ఐఐటీ తెలిపింది. 3D ప్రింట్ ఔట్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేసినట్లు వెల్లడించింది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..