ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన IAF MiG-27 ఫైటర్ జెట్ విమానం మంగళవారం ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం బారి నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఖాళీగా ఉన్న మైదానంలో కుప్పకూలిన జెట్ విమానం.. కూలిన వెంటనే మంటల్లో కాలిబూడిదైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేపనిలో నిమగ్నం కాగా అక్కడికి చేరుకున్న వైమానిక దళం, పోలీసులు ఘటన జరిగిన తీరుతెన్నులపై దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సోంబిత్ ఘోష్ ప్రమాదం వివరాలను మీడియాకు వెల్లడించారు.
పైలట్స్ సమయసూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే జెట్ విమానం నివాసాలు ఉండే ప్రాంతంపై కూలిపోయి ఉండేదని కల్నల్ సోంబిత్ ఘోష్ తెలిపారు.
కుప్పకూలిన ఫైటర్ జెట్ విమానం