పెట్రోల్ ధరల వల్ల నేను ఎఫెక్ట్ అవ్వను.. ఎందుకంటే నాకది ఉచితమే: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడుతూ నోరు జారారు.

Last Updated : Sep 16, 2018, 04:37 PM IST
పెట్రోల్ ధరల వల్ల నేను ఎఫెక్ట్ అవ్వను.. ఎందుకంటే నాకది ఉచితమే: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడుతూ నోరు జారారు. "పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నా మీద ప్రభావం ఏమీ పడదు. ఎందుకంటే మా బండ్లకు పెట్రోల్ ఉచితమే. కానీ.. ప్రజలు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ప్రభుత్వం అందుకే ధరలు తగ్గించడానికి ప్రత్యమ్నాయ మార్గాల వైపు చూస్తోంది" అని ఆయన అన్నారు.  అయితే అత్వాలే చేసిన వ్యాఖ్యల పై జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.

"మీకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు. ఆ పెట్రోల్‌ని మీకు ఉచితంగా ఇవ్వడం వెనుక ప్రజల కష్టార్జితమైన పన్నుల సొమ్ము ఉందని మీరు మర్చిపోకూడదు. ఈ విధంగా చూస్తే వారు తమ పన్నులు కట్టుకోవడమే కాకుండా.. పరోక్షంగా మీ పన్నులు కూడా చెల్లిస్తున్నారు" అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం భారతదేశం మీద పడుతుందని.. అందుకే పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు రూపాయి మారకపు విలువ పడిపోతుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే.. కేంద్రమంత్రి ఉచిత పెట్రోల్ గురించి మాట్లాడడంతో నెటిజన్లు చాలామంది ఆయనపై ఫైర్ అయ్యారు. 

ఇటీవలే పెట్రోల్ ధరలు తగ్గించమని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు అనేక పార్టీలు దేశ వ్యాప్తంగా జరిగిన హర్తాళ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.63 కు చేరింది. ఇక ముంబయి విషయానికి వస్తే..  పెట్రోల్‌ ధర రూ. 90 కి మరింత చేరువైంది. ఇక హైదరాబాద్‌ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.18 ఉండగా, డీజిల్‌ ధర రూ. 79.73కు చేరుకుంది. అలాగే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.41 ఉండగా, డీజిల్‌ ధర రూ. 78.63కు చేరింది.

Trending News