'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. 200 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రోజు రోజుకు ప్రపంచ జనాభాకు నిద్రలేని రాత్రులు తీసుకొస్తోంది. కంటి మీద కునుకు లేకుండా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ఇప్పుడు అన్ని దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. భారత దేశంలోనూ తొలుత 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. కానీ కరోనా మహమ్మారి లొంగి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడగించారు. ఈ క్రమంలో మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు లాక్ డౌన్ విధిగా పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా సూచించారు.
ప్రపంచ దేశాలు ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ మహమ్మారిపై అంతిమ విజయం మానవులదేనని స్పష్టం చేశారు. మానవత్వంతో దీనిపై విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమష్టిగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయని తెలిపారు. అన్ని రంగాలకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం అంకితభావంతో పని చేస్తుందని తెలిపారు.
The world is fighting COVID-19 together.
Humanity will surely overcome this pandemic. https://t.co/7Kgwp1TU6A
— Narendra Modi (@narendramodi) April 18, 2020
మానవత్వమే జయిస్తుంది..!!