PM kisan samman nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా..లేదా..ఒకవేళ రాకపోతే ఏం చేయాలో తెలియడం లేదా..ఇదిగో ఇలా చేయండి..మీ డబ్బులు వచ్చేస్తాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ( Pm kisan samman nidhi ) 7వ విడత డబ్బుల్ని డిసెంబర్ 25వ తేదీన దేశవ్యాప్తంగా 9 కోట్లమంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. మొత్తం 18 వేల కోట్ల రూపాయల్ని ప్రదాని మోదీ విడుదల చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని...అందరు రైతులకు ఈ సమాచారాన్ని అందించాలని 6 రాష్ట్రాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రధాని మోదీ వివరించారు.
ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీ డబ్బు ఇంకా మీ ఖాతాల్లోకి చేరకపోతే..వెంటనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ ఎక్కౌంట్ స్టేట్‌మెంట్ ( Account statement ) చెక్ చేసుకోండి. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బు పొందాలంటే..తప్పనిసరిగా మీ పేరు 7వ విడత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్‌లైన్ నెంబర్ ( Pm kisan samman nidhi helpline number ) 011-24300606కు ఫోన్ చేయండి.
లబ్దిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ( Official website ) pmkisan.gov.in ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో ఫార్మర్ కార్నర్ ఆప్షన్ కన్పిస్తుంది. అందులో కన్పించే బెనిఫిషరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం పేరు ఎంటర్ చేయండి. వివరాల్ని పూర్తి చేసిన తరువాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేసి మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది.
7వ విడత జాబితాలో మీ పేరు ఉంటే ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు ( pm kisan money ) కొద్దిరోజుల్లోనే వచ్చి పడతాయి. ఒకవేళ పేరు లేకపోతే..హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
హెల్ప్‌లైన్ నెంబర్లు..
పీఎం కిసాన్ టోల్‌ఫ్రీ నెంబర్ : 18001155266
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్ : 155261PM
కిసాన్ ల్యాండ్‌లైన్ నెంబర్ : 011-23381092, 23382401
Also read: Rajinikanth: మెరుగ్గానే తలైవా ఆరోగ్యం.. డిశ్చార్జ్‌పై నేడు నిర్ణయం