How to Change Address on Voter ID Card: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తుది ఓటరు జాబితాను రిలీజ్ చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే మీ ఓటర్ ఐడీలో పాత్ర అడ్రస్ ఉండి.. మీరు కొత్త అడ్రస్‌కు మారిపోయినా ఇంకా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఎక్కడికో మీ సేవ కేంద్రాల చుట్టు తిరగాల్సిన పనిలేదు. సింపుల్‌గా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా చేయాలంటే..?
==> ముందుగా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. మీకు అకౌంట్ లేకపోతే ముందుగా సైన్‌అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్, క్యాప్చాను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోంది. అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
==> హోమ్ స్క్రీన్‌పై ఉన్న ఫారం 8 పై క్లిక్ చేయాలి. అడ్రస్‌తోపా మీ ఓటరు ఐడీ కార్డ్‌లో ఇతర మార్పులు కూడా ఇక్కడ చేసుకోవచ్చు.
==> మీరు ఉన్న నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అడ్రస్ మార్చుకోవాలంటే ఫారం 8A ఉపయోగపడుతుంది. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంలోని ప్రాంతానికి మార్చుకోవాలంటే ఫారం 6పై క్లిక్ చేయండి.
==> మరో పేజీ ఓపెన్ అయిన తరువాత ఆ దరఖాస్తు ఎవరి కోసం అని ఉంటుంది. సెల్ఫ్, అదర్ ఎలక్టర్ ఆప్షన్లలో ఒకటిని ఎంచుకోండి. మీ అప్లికేషన్ కోసమైతే సెల్ఫ్ అని.. వేరే వాళ్ల కోసం అయితే అదర్ ఎలక్టర్ అని ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయండి.
==> ఆ తరువాత ఓటర్ ఐడీని ఎంటర్ చేసి.. డైలాగ్ బాక్స్‌లో ఇతర వివరాలను నమోదు చేయండి. అన్ని వివరాలు నిర్ధారించుకున్న తరువాత ఓకే బటన్‌పై క్లిక్ చేయాలి.
==> అనంతరం షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. మీ నివాస స్థానాన్ని బట్టి ఎంచుకోండి.
==> మీకు స్క్రీన్‌పై కనిపించిన ఫారం 8లో మూడు పార్టులు ఉంటాయి. సెక్షన్ ఏ లో స్టేట్, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోండి.
==> సెక్షన్ బీలో పర్సనల్ డిటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ తరువాత సెక్షన్ సీలో మీరు ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటున్న అడ్రస్‌ను ఎంటర్ చేసి.. అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి. సెక్షన్ డీలో డిక్లరేషన్ ఇవ్వండి. సెక్షన్ ఈలో రివ్యూ చేసి సబ్మిట్ చేయండి.
==> అడ్రస్‌ను మార్చుకునే సమయంలో సరైన అడ్రస్ ప్రూఫ్ (యుటిలిటీ బిల్లులు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్)తో పాటు అవసరమైన వివరాలను పూరించండి. అన్ని వివరాలను ఫైనల్‌గా చెక్ చేసుకున్న తరువాతే సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
==> అప్‌డేట్ అయిన డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: PM Modi Satires: దేశంలోని అన్ని సమస్యలకు 'కాంగ్రెస్ పార్టీ తల్లి': మోదీ విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook