లవ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులే కడతేర్చారు.. కారణం తెలిస్తే షాక్!

మూడు వారాల దర్యాప్తు తర్వాత పోలీసులు ఢిల్లీ యువతి హత్య కేసును ఛేదించారు. హత్య కారణాలు తెలుసుకుని నివ్వెరపోవడం పోలీసుల వంతయింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 23, 2020, 11:32 AM IST
లవ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులే కడతేర్చారు.. కారణం తెలిస్తే షాక్!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నారని, లేక కులం, ఆస్తి అంస్థులు, మతాలు వేరని పరువు హత్యలు జరగడం చూశాం. కానీ ఒకే గోత్రం కలిగిఉన్న యువకుడిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న కుటుంబసభ్యులు యువతిని దారుణంగా హత్యచేశారు. మూడు వారాల దర్యాప్తు తర్వాత పోలీసులు ఢిల్లీ యువతి హత్య కేసును ఛేదించారు. హత్య కారణాలు తెలుసుకుని నివ్వెరపోవడం పోలీసుల వంతయింది.

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా

పోలీసుల కథనం ప్రకారం.. పాల వ్యాపారం చేసే రెండు కుటుంబాలు తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో ఇరుగుపొరుగునే నివాసం ఉండేవి. ఈ క్రమంలో శీతల్ చౌదరి, అంకిత్ ప్రేమలో పడ్డారు. దాదాపు మూడేళ్లపాటు ఇంట్లోవారికి ఏ అనుమానం రాకుండా ప్రేమ వ్యవహారం నడిపిన శీతల్, అంకిత్ గత అక్టోబర్ నెలలో ఆర్య సమాజ్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే తమ కుటుంబాలతో కలిసి వీరిద్దరూ విడిగానే నివసిస్తున్నారు. శీతల్ నుంచి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంకిత్‌ను మరిచిపోవాలని సూచించగా అందుకు ఆమె నిరాకరించింది. 

Also Read: టాలీవుడ్ దర్శకుడి ఇంట విషాదం..

ఈ క్రమంలో శీతల్ కనిపించకుండా పోయింది. తన భార్య శీతల్ ఆచూకీ కనిపెట్టాలని, వివాహ పత్రాలు సైతం పోలీసులకు చూపించాడు అంకిత్. అత్తామామలు  సుమన్, రవీంద్రలపై అనుమానాలు వ్యక్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శీతల్ కుటుంబాన్ని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. అబ్బాయి, అమ్మాయిది ఓకే గోత్రం ఉన్న కారణంగా కూతురు శీతల్‌ను హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు.

See Photos: ఫొటోషూట్ కోసం టాప్ లేపిన ముద్దుగుమ్మలు! 

జనవరి 30న శీతల్‌ను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. ఆమె మృతదేహాన్ని 80కిలోమీటర్లు తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌లో ఉన్న జావా కాలువలో పడవేసినట్లు వెల్లడించారు. శీతల్ తల్లిదండ్రులతో పాటు హత్యకు పాల్పడిన మరికొందరు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News