Health Ministry new guidelines: న్యూఢిల్లీ: దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ (coronavirus) కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం హోమ్ క్వారంటైన్ (home quarantine) నిబంధనలను మార్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వారి పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను (new guidelines) జారీ చేసింది. ముందుగానే ఏదో ఒక వ్యాధి బారిన పడి బాధపడుతున్న వ్యక్తికి ఇప్పుడు కరోనా వైరస్ సంక్రమిస్తే.. వారిని హోమ్ క్వారంటైన్ (Home Quarantine New Guidelines)లో ఉండటానికి అనుమతించరు. Also read: లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి అనుమతి నిరాకరణ..
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న రోగులు అంటే.. హెచ్‌ఐవీ (HIV), అవయావ మార్పిడి (transplant), క్యాన్సర్ (cancer) చికిత్స పొందుతున్నటువంటి వారు హోమ్ క్వారంటైన్‌లో ఉండేందుకు అర్హులు కాదని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
వీరికే హోం క్వారంటైన్‌లో ఉండటానికి అనుమతి..
60 ఏళ్లు పైబడిన వృద్ధ రోగులు, రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించిన అనంతరం వారి సూచన మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతిస్తారు. Also read: COVID19 ఆసుపత్రి నుంచి పేషెంట్ అదృశ్యం
మూడు రోజులపాటు జ్వరం రాకపోతే..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్వారంటైన్ కాలాన్ని కూడా తగ్గించింది. లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్‌లో ఉండే రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
పెరుగుతున్న ఐసీయూ కేసులు..
గురువారం వరకు ఆరు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 34,450 మంది రోగులను ఐసీయూలో ఉంచారు. 37,505 మందికి ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించారు. అయితే 9,272 మంది రోగులను వెంటిలేటర్‌పై ఉంచారు. ఇప్పటివరకు ఉన్న 2,26,947 యాక్టివ్ కేసుల్లో బుధవారంతో పోలిస్తే.. గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఐసీయూలో రోగుల సంఖ్య పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..