రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఖమ్మంలో ఆయన చెప్పిన మాటలు ఇంకా మరువకముందే మధ్య ప్రదేశ్ ఇండోర్ లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో హిందుస్థాన్ (భారత్) హిందువులదేనని స్పష్టం చేశారు. అయితే హిందుస్థాన్ లో ఇతర మతస్థులు కూడా జీవించవచ్చని చెప్పారు.
జర్మన్ల కోసం జర్మనీ, అమెరికన్ల కోసం అమెరికా, బ్రిటీషర్ల కోసం బ్రిటన్.. ఎలాగో హిందువుల కోసం హిందుస్థాన్ అని ఆయన స్పష్టం చేశారు. హిందువులు అంటే భారతమాత బిడ్డలని ఆయన వివరించారు. ప్రాచీన భారత సంస్కృతి, సాంప్రదాయాలను ఎవరైతే కొనసాగిస్తారో వారంతా భారతీయులే. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని భగవత్ పేర్కొన్నారు. భారత్ ను ఏ పార్టో, వ్యక్త్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజంలో మార్పు, అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.