Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి

హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థి అర్చనా గౌతమ్ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని నెటిజన్లు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అర్చన.. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని కోరారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 01:26 PM IST
  • మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
  • నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు
  • నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే
Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి

Hastinapur Congress candidate Archana Gautam responds on her Miss Bikini India 2018 Pics: సినీ, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఎప్పటినుంచో ఉంది. సినీ రంగంలో రాణించిన ఎందరో రాజకీయాల్లో కూడా సత్తాచాటారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు రాజకీయనాయకులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నవనీత్ కౌర్, నుస్రన్ జహాన్, మీమీ చక్రవర్తి లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరి బాటలోనే మోడల్, నటి అర్చనా గౌతమ్ (Archana Gautam) చేరనున్నారు. ఉత్తరప్రదేశ్ హస్తినాపుర్ (Hastinapur) అసెంబ్లీ అభ్యర్థిగా అర్చనా గౌతమ్ పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ (Congress) పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP assembly Polls) 125 స్థానాలకు గాను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) గురువారం (జనవరి 13) 125 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇందులో 40 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అందులో ఒకరే అర్చనా గౌతమ్. అర్చనా గౌతమ్ యూపీకి చెందిన మోడల్, నటి. మీరట్‌లో జన్మించిన అర్చనా సినీ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అర్చనా గౌతమ్‌ని సౌత్ సన్నీ లియోన్ (Sunny Leone) అని కూడా పిలుస్తారు. ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Also Read: Rohit Sharma - Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంతో షాక్‌కు గురయ్యా.. రోహిత్ శర్మ ఇంకా ఏమన్నాడంటే?

అర్చనా గౌతమ్ జర్నలిజం చదివారు. అనంతరం మోడలింగ్, యాక్టింగ్ వైపు వెళ్లారు. అర్చన 2014లో మిస్ యూపీ (Miss UP)గా ఎన్నికయ్యారు. మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీలో విజేతగా నిలిచారు. మిస్ ఉత్తరప్రదేశ్ 2014, మిస్ కాస్మో ఇండియా 2018తో సహా అనేక టైటిల్స్ అర్చన సొంతం చేసుకున్నారు. ఇక అడల్ట్ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'తో అర్చనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తమిళం, హిందీ మరియు తెలుగు సినిమాలలో కూడా ఆమె నటించారు. సథియా సాథ్ నిభానా, కుబూల్ హై, సీఐడీ లాంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. 

ఇక 2022 ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అర్చనా గౌతమ్ ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈమె ఎవరు అని ప్రజలు గూగుల్‌లో సెర్చ్ చేయగా.. అసలు విషయం బయటికి వచ్చింది. చాలా మంది ఆమె గురించి శోధించడంతో.. అర్చనా బికినీ ఫొటోలు (Archana Gautam Bikini Pics) వైరల్ అయ్యాయి. దాంతో ప్రచారంలో పాల్గొంటున్న ఆమెకు కాస్త నిరాశ ఎదురైంది. కొందరు నెటిజన్లు ఆమె బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అర్చనా.. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని కోరారు. 

Also Read: UP Polls 2022: ఎన్నికల వేళ ఎస్పీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ములాయం కోడలు

తాజాగా ఓ జాతీయ మీడియాతో అర్చనా గౌతమ్ మాట్లాడుతూ... 'మిస్ బికినీ 2018 (Miss Bikini India 2018)లో నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను. నేను మిస్ ఉత్తరప్రదేశ్ 2014 మరియు మిస్ కాస్మో వరల్డ్ 2018 గెలిచాను. దయచేసి వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని కోరుతున్నా. నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు. నేను ఎందుకు రాజకీయాలలోకి వస్తునాన్నో తెలుసుకొని ఓటు వేయండి. నా సొంత ఊరిలో రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి విన్నాను వారికి ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చా.  హస్తినాపుర్ మంచి పర్యాటక ప్రాంతం. పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి కానీ కనెక్టివిటీ సమస్య వల్ల ప్రజలు ఇక్కడికి రాలేకపోతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నిర్మించడమే నా మొదటి ప్రాధాన్యత. టూరిజం వస్తే.. ప్రజలకు ఉపాధి లభిస్తుంది' అని అన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News