CBSE Admit Card Out: CBSE అడ్మిట్ కార్డ్‌ని విడుదల చేసింది. ఈ నెలలోనే పరీక్షలు ఉండటంతో నిన్న హాల్ టిక్కెట్లను రిలీజ్ చేసింది. డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి బోర్డు థియరీ పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.CBSE బోర్డు పరీక్ష 2024 ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమవుతుంది. గత సంవత్సరం, టైమ్ టేబుల్ సిద్ధం చేసేటప్పుడు, JEE మెయిన్ మరియు NEET వంటి పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకున్నారు. సంబంధిత విద్యార్థులు నేరుగా CBSE cbse.gov.in అధికారిక వెబ్సైట్ నుండి తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Top MBA Colleges in India: ఈ కాలేజీలో MBA పూర్తిచేస్తే కోట్లలో శాలరీ ప్యాకేజీ.. ఇది దేశంలోనే టాప్ కాలేజీ..
అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?
- ముందుగా CBSE cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- ఇప్పుడు మీరు హోమ్‌పేజీలో అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మీరు అడిగిన వివరాలను నమోదు చేసి సమర్పించండి.
- అప్పుడు మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పాఠశాలలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సూచనల మేరకు నిర్ణయం మేరకు ఈ సంవత్సరం, CBSE బోర్డు అకౌంటెన్సీ సబ్జెక్ట్ కోసం ఇచ్చిన ప్రత్యేక జవాబు పత్రాన్ని తొలగించాలని నిర్ణయించింది. “స్టేక్హోల్డర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా CBSE బోర్డు, 2024 సంవత్సరపు బోర్డు పరీక్ష నుండి అకౌంటెన్సీ సబ్జెక్టుకు సంబంధించిన పట్టికలో ఉన్న జవాబు పత్రాన్ని తొలగించాలని నిర్ణయించిందని అధికారిక నోటీసు పేర్కొంది,.
బోర్డు మార్కుల శాతాన్ని లెక్కించదు లేదా ప్రకటించదు లేదా తెలియజేయదు. విద్యార్థుల శాతాన్ని లెక్కించేందుకు గల ప్రమాణాలను వివరించాలని పలువురు అభ్యర్థుల నుంచి వినతులు అందిన తర్వాత బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది.
CBSE క్లాస్ 10,12 డేట్ షీట్..
10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష మార్చి 21న ముగియనుండగా.. 12వ తరగతి బోర్డు పరీక్ష ఏప్రిల్ 5న ముగుస్తాయి
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి