Gyanvapi Case Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం..విచారించేందుకు కోర్టు పచ్చజెండా..!

Gyanvapi Case Verdict: దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 12, 2022, 05:22 PM IST
  • జ్ఞానవాపి మసీదు కేసు
  • విచారణ చేపట్టిన స్థానిక కోర్టు
  • ఈనేపథ్యంలో కీలక నిర్ణయం
Gyanvapi Case Verdict:  జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం..విచారించేందుకు కోర్టు పచ్చజెండా..!

Gyanvapi Case Verdict: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాశీ విశ్వనాథ్‌ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసును అక్కడి కోర్టు విచారించింది. ఈసందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ..ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌కు పచ్చ జెండా ఊపింది. పిటిషన్‌ను విచారించేందుకు అంగీకారం తెలిపింది. పిటిషన్ విచారించేందుకు అర్హత లేదని ప్రతివాదులు న్యాయస్థానంలో వాదించారు. ఈసందర్భంగా వారి వ్యాఖ్యలకు కోర్టు తోసిపుచ్చింది.

ఈనేపథ్యంలో ఐదుగురు మహిళలు వేసిని పిటిషన్‌ను ఇకపై కోర్టు విచారణ చేపట్టనుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. తీర్పును హైకోర్టులో  సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని హిందూ సంఘాలు స్వాగతించాయి. మరోవైపు జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ప్రత్యేక బృందం సర్వేను పూర్తి చేసింది.  సర్వే ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని..నివేదికను కోర్టులో అందజేయాలని స్పష్టం చేసింది. ఐతే సర్వే నివేదికలోని కీలక అంశాలు బహిర్గం అయ్యింది. దీంతో అసలు వివాదం మొదలైంది. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు తేల్చి చెప్పింది. జ్ఞాన వాపి మసీదులో శివలింగాకారం బయటపడింది. ఈక్రమంలో అక్కడ పూజలు చేసేలా అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు కోర్టుకు వెళ్లారు. 

మసీదులో బయపడ్డ ఆకారం శివలింగం కాదని మసీద్ కమిటీ స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అంశాన్ని కింది స్థాయి కోర్టులో తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో తిరిగి వారణాసి కోర్టుకు కేసు చేరింది. 

Also read:CM Jagan: ఇకపై ప్రతి స్కూల్‌లో ఇంటర్నెట్ సదుపాయం..విద్యా శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

Also read:Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News