Gujarat: సముద్రంలో మునిగిన 15 పడవలు..పలువురు మత్స్యకారులు గల్లంతు..

Boats Capsize: గుజరాత్​లోని నవబందర్ ప్రాంతంలో సుమారు 15 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. పలువురు మత్స్యకారులు గల్లంతు కాగా...అందులో నలుగురు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 01:17 PM IST
Gujarat: సముద్రంలో మునిగిన 15 పడవలు..పలువురు మత్స్యకారులు గల్లంతు..

Boats Capsize In Gujarat: భారీ ఈదురుగాలులకు సుమారు 15 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన గుజరాత్ గిర్ సోమనాథ్(Boats Capsize In Gir Somnath)లోని నవబందర్ పోర్టు ప్రాంతంలో చోటుచేసుకుంది.  సుమారు 10 నుంచి 15 మంది మత్స్యకారులు(Fishermen ) గల్లంతై ఉండొచ్చని.. స్థానికులు తెలిపారు. 

స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. తీరరక్షక దళ సిబ్బందితో కలిసి అత్యవసర చర్యలు ప్రారంభించినట్లు ఉనా తాలుకా రెవెన్యూ అధికారి ఆర్ఆర్ ఖంభ్రా వెల్లడించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్​తో గాలింపు చేస్తున్నట్లు ప్రకటించారు.  అయితే కనిపించకుండా పోయిన వారిలో నలుగురు మత్స్యకారులు తీరానికి ఈదుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: Leopard Strays Into School: పదో తరగది విద్యార్థిపై చిరుత పులి ఎలా దాడి చేసిందో చూడండి!

ఈదురుగాలుల కారణంగా తీరంలో లంగరు వేసిన 10 బోట్లు(Fishing Boats) పూర్తిగా ధ్వంసమయ్యాయని.. 40 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా దక్షిణ గుజరాత్(Gujarat), మహారాష్ట్రలో బుధవారం భారీ వర్షాలు(Heavyr Rains) కురిశాయి. నవబందర్ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తుండగా.. ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News