జీఎస్‌టీ సరికొత్త రికార్డు: మే నెలలో రూ. 94,016 కోట్లు వసూళ్లు

ఈ రెండు నెలల్లో జీఎస్‌టీ చెల్లింపుదారులు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఏప్రిల్‌లో రూ.103,458 కోట్లు వసూళ్లవ్వగా, మే నెలలో దాదాపు రూ. 94,016 కోట్లు జీఎస్‌టీ వసూళ్లగా నమోదయ్యాయి.  

Last Updated : Jun 1, 2018, 04:17 PM IST
జీఎస్‌టీ సరికొత్త రికార్డు:  మే నెలలో రూ. 94,016 కోట్లు వసూళ్లు

ఈ రెండు నెలల్లో జీఎస్‌టీ చెల్లింపుదారులు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఏప్రిల్‌లో రూ.103,458 కోట్లు వసూళ్లవ్వగా, మే నెలలో దాదాపు రూ. 94,016 కోట్లు జీఎస్‌టీ వసూళ్లగా నమోదయ్యాయి.  2017 జులైలో జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలులోకి వచ్చాక కొన్ని రోజులు నత్తనడక నడిచినా.. ఈ మధ్యకాలంలో వసూళ్లు బాగా పుంజుకున్నాయి.

మే నెల వసూళ్ళ ద్వారా కేంద్రానికి 28,797 కోట్లు సమకూరగా.. రాష్ట్రాలకు రూ. 34,020 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జీఎస్‌టీ వసూళ్ళ నెలవారీ యావరేజీ చూసుకుంటే.. ప్రతీ మాసం  దాదాపు రూ.89,885 కోట్లను ప్రభుత్వం ఆదాయంగా పొందగా..ఈవే బిల్లుల పథకం అమలులోకి వచ్చాక ఆదాయ పెరుగుదలలో గణనీయ మార్పును గమనించవచ్చు. ఇదిలా ఉండగా.. మే 2018 నెలలో 62.46 లక్షలమంది సేల్స్ రిటర్నులు దాఖలు చేశారు. అలాగే మార్చి నెలలో ప్రభుత్వం జీఎస్‌టీ పరిహారం క్రింద రాష్ట్రానికి  రూ. 6696 కోట్లు విడుదల చేసింది. 

జీఎస్టీ అన్నది దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులు, సేవలు, అమ్మకం, వినియోగాలపై విధించే సమగ్రమైన పరోక్ష పన్ను. ఈ పద్ధతి ద్వారా జీఎస్టీ పరిధిలోని వ్యాపార సంస్థలు, వ్యక్తులు తాము  కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై జీఎస్టీ విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. జీఎస్టీ అమలయ్యాక ఎగుమతులను జీరో-రేటెడ్ సప్లైలుగా పరిగణించారు. దిగుమతులపై కూడా జీఎస్టీ కిందకు రాని కస్టమ్ డ్యూటీనీ.. అలాగే దేశీయ వస్తువులు, సేవలకు కూడా జీఎస్టీని విధించారు.

Trending News