గృహ కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గనున్న జీఎస్టీ రేటు!

గృహ కొనుగోలుదారులకు శుభవార్త.

Last Updated : Jun 28, 2018, 05:01 PM IST
గృహ కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గనున్న జీఎస్టీ రేటు!

గృహ కొనుగోలుదారులకు శుభవార్త. సిమెంట్, రంగుల వంటి నిర్మాణ రంగ సామాగ్రిపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేటు తగ్గే అవకాశం ఉంది. నిర్మాణ సామాగ్రిపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించేలా జులై 19న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు రాజముద్ర పడితే ఇల్లు కొనుక్కొనేవారికి, ఇల్లు కట్టేవారికి వ్యయ భారం తగ్గుతుందని ఓ అధికారి వెల్లడించారు. అలాగే ఇళ్లకు డిమాండ్ పెరిగేందుకు కూడా ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.  భారత జీడీపీలో ఈ రంగ వాటా దాదాపు 8 శాతం.

2022 కల్లా అందరికీ గృహ వసతి కల్పించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నికర వినియోగ స్థలం (కార్పెట్‌ ఏరియా) నిబంధనలను సులభం చేశారు. అటు గత రెండు నెలల్లో రూ.2వేల కోట్లకు పైగా జీఎస్టీని వ్యాపారులు/ వివిధ సంస్థలు ఎగవేసినట్లు జీఎస్టీ దర్యాప్తు విభాగం గుర్తించింది.

పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో 2016-17లో స్వల్పంగా 1.3% వృద్ధిని నమోదు చేసిన నిర్మాణ రంగం.. 2017-18లో 5.7 శాతం వృద్ధిని సాధించింది. నాలుగో త్రైమాసికంలోనూ 11.5 శాతం వృద్ధి నమోదైంది.

Trending News