Salary Hike For Private Employees: ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు లేదా జీతాల పెంపు గురించి వింటుంటాం. కానీ ఈసారి దేశంలోని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందనుంది. ఈసారి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల జీతాల్ని 9.5 శాతం పెంచనున్నాయి.
ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల జీతాల పెంపుపై తాజాగా ఓ అధ్యయనం వెలువడింది. ఇందులో 45 పరిశ్రమలు, 1414 కంపెనీల డేటా ఉంది. ఈ అధ్యయనం అందిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడాది జీతాలు 9.5 శాతం పెరగవచ్చు. గత ఏడాది అంటే 2023తో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ. గత ఏడాది ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు 9.7 శాతం జీతం పెరిగింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ Aon PLC ఈ అధ్యయనం జరిపింది. 2022లో క్షీణత రేటు 21.4 శాతం ఉంటే 2023లో అది 18.7 శాతమైంది.
దేశంలోని 45 పరిశ్రమలు, 1414 కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది ఈ కంపెనీలన్నీ ఉద్యోగుల జీతాల్ని 9.5 శాతం పెంచుతుంది.
ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల సంగతి ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈసారి భారీగా పెరగనున్నాయి. ప్రతి యేటా పెరిగే డీఏ ఈసారి మరో 4 శాతం పెరగనుంది. అంటే 46 శాతం ఉన్న డీఏ కాస్తా ఇప్పుడు 50 శాతానికి చేరుకోనుంది. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోగానే ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలుపుతారు. జనవరి నుంచి పెంచాల్సిన డీఏ మార్చ్ నాటికి అమలు కానుంది. అంటే మార్చ్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఒకేసారి 9000 రూపాయలు పెరగనుంది. అదే సమయంలో 7వ వేతన సంఘం ముగిసి 8వ వేతన సంఘం అమలు కానుంది.
Also read: Famers Protest: ఢిల్లీ రైతుల నిరసనలో షాకింగ్ ఘటన.. ఆత్మాహుతికి పాల్పడిన రైతు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook