ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. అయినప్పటికీ బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి.

Last Updated : May 27, 2020, 10:28 AM IST
ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. అయినప్పటికీ బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.    బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.150 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,150కి ఎగసింది. ఇప్పటివరకూ ఇదే ఆల్ టైమ్ రికార్డు ధర. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,440కి చేరుకుంది.  మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్

ఢిల్లీ మార్కెట్‌లోనూ వరుసగా రెండో రోజులు ర్యాలీ చేసిన బంగార ధరలు నేడు దిగొచ్చాయి. నిన్న రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి మార్కెట్‌లో రూ.110 మేర తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,810కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000కి క్షీణించింది. 

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన వెండి ధర రూ.360 తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.48,000కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News