నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

ఈ నెల మొదట్లో బులియన్ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. కొనుగోలుదారులకు కాస్త ఊరట కలుగుతోంది. అయినా ధరలు ఎక్కువగానే ఉన్నాయని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 8, 2020, 07:45 AM IST
నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో వారాంతంలోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం మొదట్లో ఆల్ టైమ్ రికార్డు ధర నమోదైనప్పటి నుంచీ బంగారం ధరలు దిగి రావడం కొనుగోలుదారులకు నిజంగానే శుభవార్త.  మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.480 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,350కి దిగొచ్చింది.  అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,270కి క్షీణించింది. జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా ఐదోరోజూ బంగారం ధరలు తగ్గాయి.  బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.300 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,200కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000కి పడిపోయింది.  లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’‌ని చూశారా!

జూన్ 2న ఆల్ టైమ్ రికార్డు ధర నమోదు చేసిన వెండి ధరలు సైతం నేలచూపులు చూస్తున్నాయి. నిన్న మార్కెట్‌లో రూ.20 మేర తగ్గిన వెండి ధర నేడు రూ.1,080 మేర భారీగా దిగొచ్చింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,400కి పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
 

Trending News